ఏయన్నార్ ఖాతాలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. ఎన్నో తెలుసా!
on Sep 20, 2023
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. తన కెరీర్ లో పలు పురస్కారాలు పొందారు. మరీ ముఖ్యంగా.. ప్రతిష్ఠాత్మక 'ఫిల్మ్ ఫేర్' అవార్డులను వివిధ విభాగాల్లో ఆయన సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడుగా, ఉత్తమ నిర్మాతగా.. అలాగే లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ కేటగిరిలోనూ ఆయన అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. 1968లో విడుదలైన 'సుడిగుండాలు' కోసం ఆదుర్తి సుబ్బారావుతో కలిసి తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నారు అక్కినేని. అయితే, ఇది నిర్మాతగా దక్కిన పురస్కారం కావడం విశేషం. ఇక ఉత్తమ నటుడు విభాగంలో 'మరపురాని మనిషి' (1973), 'ఆత్మ బంధువులు' (1987), 'సీతారామయ్య గారి మనవరాలు' (1991) సినిమాలకి గానూ కైవసం చేసుకున్నారు. ఇక ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ విషయానికి వస్తే 1988 సంవత్సరంలో ఆయన ఈ పురస్కారాన్ని పొందారు.
(సెప్టెంబర్ 20.. ఏయన్నార్ శతజయంతి సందర్భంగా)
Also Read